తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. 13 మందికి స్థానచలనం

  • హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న హరిచందన బదిలీ
  • ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్‌గా సంజయ్ కుమార్
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు మారిన దాన కిషోర్
  • ఖమ్మం, నిర్మల్, సంగారెడ్డి కలెక్టర్లకు స్థానచలనం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చేపట్టింది. ఈ మేరకు భారీ స్థాయిలో 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న దాసరి హరిచందన సహా పలువురు సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గవర్నర్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ (1995 బ్యాచ్)ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎం. దాన కిషోర్ (1996 బ్యాచ్)ను సంజయ్ కుమార్ స్థానంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిశోర్ పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు.

ఈ బదిలీల్లో హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన (2010 బ్యాచ్) బదిలీ ప్రధానంగా నిలిచింది. ఆమెను కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శిగా నియమించారు. దీంతో పాటు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ కార్యదర్శిగా కూడా ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (2018 బ్యాచ్)ని ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేసి, గనులు మరియు భూగర్భ వనరుల శాఖ డైరెక్టర్‌గా, తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMDC) వీసీ & ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. 

సంగారెడ్డి కలెక్టర్ పి. ప్రవీణ్య (2016 బ్యాచ్)ను రవాణా, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ (2018 బ్యాచ్)ను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఇంటర్ బోర్డు సెక్రటరీగా నియమించారు.

ఇతర ముఖ్యమైన బదిలీలలో, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ జెండాగే హనుమంత్ కొండిబ (2016 బ్యాచ్)ను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా బదిలీ చేశారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణ ఆదిత్య (2014 బ్యాచ్)ను పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.ఎం. సంతోష్ (2017 బ్యాచ్)ను అదే శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించి, డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగేలా ఆదేశించారు. 

ఈ మార్పులతో పరిపాలనను మరింత గాడిలో పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన అధికారులకు కూడా వివిధ శాఖల్లో కీలక బాధ్యతలు అప్పగించారు.


క్ర.సం.పేరుబ్యాచ్పాత హోదాకొత్త హోదాఅదనపు బాధ్యతలు (FAC)
1సంజయ్ కుమార్1995స్పెషల్ చీఫ్ సెక్రటరీ, PR&RDస్పెషల్ ఆఫీసర్, తెలంగాణ భవన్, న్యూఢిల్లీ
2ఎం. దాన కిషోర్1996స్పెషల్ చీఫ్ సెక్రటరీ, LET&Fస్పెషల్ చీఫ్ సెక్రటరీ, PR&RDగవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగింపు
3బి. విజీంద్ర2006సెక్రటరీ, TGSWREIS & కమిషనర్, SCDసెక్రటరీ, SCD డిపార్ట్‌మెంట్సెక్రటరీ, TGSWREIS & కమిషనర్, SCD
4హరిచందన దాసరి2010కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, హైదరాబాద్సెక్రటరీ, LET&Fసెక్రటరీ, రెవెన్యూ (DM)
5కృష్ణ ఆదిత్య ఎస్2014డైరెక్టర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్పెషల్ సెక్రటరీ, పరిశ్రమలు & వాణిజ్యం
6జెండాగే హనుమంత్ కొండిబ2016డైరెక్టర్, సివిల్ సప్లయిస్సీఈవో, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్స్పెషల్ సెక్రటరీ, PE డిపార్ట్‌మెంట్
7పి. ప్రవిణ్య2016కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, సంగారెడ్డిస్పెషల్ సెక్రటరీ, R&B (TR&B)
8సంతోష్ బి.ఎం.2017డైరెక్టర్, గిరిజన సంక్షేమంస్పెషల్ సెక్రటరీ, గిరిజన సంక్షేమండైరెక్టర్, గిరిజన సంక్షేమం
9అనుదీప్ దురిశెట్టి2018కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, ఖమ్మంజాయింట్ సెక్రటరీ, ITE&Cడైరెక్టర్, మైన్స్ & జియాలజీ, వీసీ & ఎండీ, TGMDC
10అభిలాష అభినవ్2018కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, నిర్మల్డైరెక్టర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ & సెక్రటరీ, BIE
11జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్2019అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), నాగర్‌కర్నూల్డైరెక్టర్, సివిల్ సప్లయిస్
12జి. ముకుంద రెడ్డి2019జోనల్ కమిషనర్, GHMC (గోల్కొండ)స్పెషల్ కమిషనర్, I&PR, ఈవో స్పెషల్ సెక్రటరీ, GA (I&PR)
13అపూర్వ్ చౌహాన్2020జోనల్ కమిషనర్, GHMC (కూకట్‌పల్లి)ప్రాజెక్ట్ డైరెక్టర్ (CMRO), ప్రాజెక్ట్ O/o CCLA


Dasari Harichandana
Telangana IAS transfers
IAS officers transfer
Telangana government
Khammam Collector
Sanjay Kumar IAS
M Dana Kishore
Hyderabad Collector
Anudeep Durishetty
Telangana administration

More Telugu News